రోడ్డు భద్రతా అందరి బాధ్యత : సిఐ శ్రీరాం

రోడ్డు భద్రతా అందరి బాధ్యత అని పొదిలి సిఐ శ్రీరాం అన్నారు.

వివరాల్లోకి వెళితే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి యేటా వారం రోజుల పాటు నిర్వహించే జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 27 నుంచి 32వ జాతీయ భద్రతా వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా స్థానిక పొదిలి ఆర్టీసీ డిపో నందు డిపో మేనేజర్ గిరిబాబు అధ్యక్షతనతో సమావేశంలో పలువురు మాట్లాడుతూ రోడ్ భద్రతా సంబంధించి ప్రభుత్వం సూచనలు సలహాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు దోహదపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ వి శ్రీరాం, యస్ఐ సురేష్ మరియు డిపో సిబ్బంది మరియు డిపో కార్మికులు తదితరులు పాల్గొన్నారు