ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో సామాజిక నిరాహార దీక్షలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే సోమవారం స్ధానిక పొదిలి ఆర్టీసీ గ్యారేజ్ వద్ద యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 6వ తేది నుండి తలపెట్టిన సన్నాహక సమ్మె విజయవంతంలో భాగంగా సామాజిక నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ యాజమాన్యం తమ యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో మొండి వైఖరి అవలభిస్తుందని దానికి నిరసనగా డిసెంబర్ 31వ తేది సమ్మె నోటీసు అందజేశమని అందులో భాగంగా దీక్షలు చేస్తున్నామని ఇప్పటికైనా యాజమాన్యం తమ డిమాండ్లను పరిష్కారించాలని లేకపోతే సమ్మెలోకి వెళతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎ దివాకర్, షేక్ బాజీ, షేక్ యం భాష, బియస్ రావు, షేక్ కరిముల్లా, షేక్ ఖాధర్ భాష, లక్మమ్మ, రమాదేవి, లక్ష్మి, కె వి రావు, సుబ్బారావు, దాసరి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.