ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా
ప్రజా రవాణా సంస్థ ఉద్యోగులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ వద్ద ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా డిపోల ధర్నా కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఇప్పటి వరకు అందుతున్న రాయితీలు రద్దు చేయడంతో కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని….. ప్రభుత్వ ఉద్యోగులకు అందే రాయితీలు రాకపోగా ఇప్పుడు వరకు ఉన్న రాయితీలు కూడా రద్దు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలన నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.