ఎస్ టి ఐ ని వెంటనే బదిలీ చెయ్యాలి – ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఏకపక్షంగా ఒక ఉద్యోగ సంఘానికి కొమ్మకాస్తు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పొదిలి ఆర్టీసి అధికారులను తక్షణమే బదిలీ చెయ్యాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు
శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన గెట్ మీటింగ్ సందర్భంగా పలువురు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ త్వరితగతిన డ్యూటీ చార్ట్ లు వేసి లీవ్ పొజిషన్ కల్పించాలని మరియు ఒక సంఘానికి కొమ్ము కాస్తున్న ఆర్టీసీ అధికారులు పై చర్యలు తీసుకోవాలని లేకపోతే 15వ తేదీన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎండీ బాజీ, దివాకర్, షేక్ ఖాదర్ భాషా,పి ఓబులేసు మరియు ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు