ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం పట్ల జగన్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన కార్మిక సంఘాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీర్మానం చేయడం పట్ల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేం చేశారు.
వివరాల్లోకి వెళితే స్ధానిక పొదిలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నేషనల్ మజ్ధుర్ యూనియన్, మరియు ఎంప్లాయిస్ యూనియన్ విడివిడిగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ విలీనంపై ఆంజనేయరెడ్డి అధ్యయన కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఆర్టీసీలో ప్రస్తుతం 53వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెరుగుతుందని….. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలన్నీ పొందుతామని….. తమ చిరకాల డిమాండును నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ కార్మికసంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.