10వ తరగతి పరీక్షలు ప్రారంభం పరీక్షలు కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు – ఆర్టీసీ డిపో మేనేజర్ సుందరరావు
10వ తరగతి పరీక్షలు బుధవారం నాటి నుండి ప్రారంభం కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు పొదిలి డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు తిప్పుతున్నమని పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ సుందరరావు తెలిపారు.
స్థానిక పొదిలి ఆర్టీసీ బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలకు బస్సు సౌకర్యం లేని చోట ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసామని బస్సులో హాల్ టికెట్ చూపించి ఉచితముగా ప్రయాణం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని 10వ తరగతి పరీక్షలు పూర్తి అయ్యే వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు.
మండలంలోని పలు పరీక్ష కేంద్రాలను మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్ సందర్శించి ఏర్పాట్లు ను పర్యవేక్షించారు.
ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.