నీటి మూట – కాంట్రాక్టర్లు కన్నీటి మాట నిధులు చెల్లింపులో తీవ్ర ఆరోపణలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రభుత్వం గ్రామీణ రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టు కింద ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేసిన వారికి నగదు చెల్లింపులు చేయడానికి పొదిలి ప్రాజెక్టు కు సుమరు ₹13 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే, ఈ నిధుల విడుదలలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా అధిక కమీషన్లు ఇచ్చిన వారికి మాత్రమే చెల్లింపులు జరుగుతున్నాయట. ఒక జిల్లా స్థాయి అధికారి ప్రమేయంతో అనర్హ వ్యక్తులకు కూడా లబ్ధి చేకూరుతున్నట్లు సమాచారం అసలు సరఫరా చేయని ట్రాక్టర్లకు కూడా బిల్లులు తయారు చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వరుస క్రమంలో కాంట్రాక్టర్లు కు చెల్లింపులు చేయకుండా తాము కోరుకున్న వారికి అధిక కమిషన్ ఇచ్చే వారికి నిధులు మంజూరు చేయటం తో నీటి మూట ఇవ్వలేని కాంట్రాక్టర్లు కన్నీటి మాటలతో ఏకరువు పెడుతున్నారు.
తక్షణమే జిల్లా అధికారులు స్పందించి వరస క్రమంలో నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు