డ్వాక్రా సంఘల ర్యాలీ…..బాబు చిత్రపటానికి పాలభిషేకం
డ్వాక్రా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే సోమవారం స్ధానిక విశ్వనాథపురంలోని వెలుగు కార్యాలయం నుండి పెద్ద బస్టాండ్ వరకు పొదుపు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పెద్ద బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అక్కడే ఏర్పాటు చేసిన చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అధితిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత కమిషన్ డైరెక్టర్ స్వర్ణ గీత మాట్లాడుతూ మహిళలకు పెద్ద అన్నగా ఉండి ప్రతి డ్వాక్రా పొదుపు సంఘం మహిళలకు పసుపు కుంకుమ క్రింద పది వేలు రూపాయలు తమ ఖాతాలో జమ చేశారని మహిళలకు అన్ని రంగాలలో అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పాటుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ నాయకులు షేక్ షన్వాజ్, సోమిశెట్టి శ్రీదేవి, తెదేపా నాయకులు యర్రంరెడి వెంకటేశ్వర రెడ్డి, కాటూరి సుబ్బయ్య, షేక్ రసూల్, యండి గౌస్, గునుపుడి భాస్కర్, షేక్ జిలానీ, ముల్లా ఖుద్దూస్, షేక్ యాసిన్, మరియు డ్వాక్రా పొదుపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.