ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
పొదిలి ప్రభుత్వ బాలుర హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు పాల్గొని విద్యార్హులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కళ్ళం సుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.