క్రమశిక్షణ తో విద్యార్థులు ఎదగాలి: సాయి

క్రమశిక్షణ తో విద్యార్థులు ఎదగాలని పొదిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోల సమావేశంలో జడ్పీటిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు అన్నారు. పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమం విద్యార్థులనుద్దేశించి ఎంపీపీ నర్సింహారావులు ఎంపిటిసి సభ్యురాలు గౌసియా ప్రసగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.