ప్రాణం తీసిన చరవాణి
పొదిలి మండలం సలకనూతల గ్రామ సమీపంలోని కంకరమిల్లు వద్ద చేతిలోనుండి జారి పడిపోతున్న మొబైల్ ఫోన్ ను పట్టుకోబోయి మహిళ మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే పొదిలి స్థానిక విశ్వనాధపురంలోని సాయి కంప్యూటర్స్ నిర్వహకురాలు విజయలక్ష్మి (40)కి మునగపాడు గ్రామంలో రేషన్ డీలర్ షిప్ కూడా కలదు. మృతురాలి సోదరుడు సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనంపై తను తన సోదరి విజయలక్ష్మి కలిసి మునగపాడు గ్రామంలోని రేషన్ షాప్ కు వెళ్తుండగా సలకనూతల కంకరమిల్లు సమీపంలో తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ జారింది మొబైల్ ఫోన్ ను పట్టుకునే ప్రయత్నంలో విజయలక్ష్మి ప్రమాదవశాత్తు జారి రోడ్డుపై పడిపోయింది తలకు బలమైన గాయం అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి సోదరుడి వాంగ్మూలం సేకరించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.