వాటర్ షెడ్ సామాజిక తనిఖీ లో కోట్ల రూపాయల అవినీతి బయట పడుతున్న వైనం మీడియా సిబ్బంది పై దాడికి యత్నం

ఆంధ్రప్రభ మనం విలేకర్లను చంపుతామని బెదిరించిన సర్పంచ్ వర్గీయులు

సమావేశం రసాభాస వేదిక మార్చిన అధికారులు

పొదిలి మండలం కంభాలపాడు మెగా వాటర్ షెడ్ యాజమాన్యం సామాజిక తనిఖీ ప్రజావేదిక గ్రామసభ స్థానిక మాదలవారిపాలెం గ్రామ పంచాయతీ వద్ద శుక్రవారం ఉదయం ప్రారంభించారు కంభాలపాడు మాదలవారిపాలెం ఓబులక్కపల్లి తుమ్మగుంట గ్రామపంచాయితీలు నాలుగు కలిపి కంభాలపాడు మెగా వాటర్ షెడ్ సంబంధించిన గ్రామసభలో ఒక్క ఒక్కటి అవినీతి అక్రమలు వెలుగు చూడటం మొదలు కావటంతో అక్కడే ఉన్న మీడియా సిబ్బంది సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి పనిలో ఉన్నారు ఎక్కడ తాము చేసిన అవినీతి అక్రమలు బయటకు వస్తాయిని గ్రాహించి అక్రమలకు పాల్పడిన వారందరూకలిసి మాదలవారిపాలెం గ్రామ పంచాయితీ సర్పంచ్ సారథ్యం లో ఒక్కసారిగా దాడికి యత్నంచారు దానితో అక్కటే ఉన్న అధికారులు గ్రామస్థులు అడ్డుకున్నారు ఆంద్రప్రభ మనం విలేకర్లను అసభ్యాకరమైన పదజలంతో దూషింషిస్తు మీరు వార్తలు రాస్తే చంపుతామని బెదిరించి కుర్చీలు వేసిరివేసి బయభ్రంతులు చేసారు దానితో పరిస్థితి చేయిదాటంతో సదురు విషయంని సమాచారం అందించిన పోలీసులు స్పందించాలేదు సమావేశం మొత్తం రసాభాసాగా మారటంతో సామాజిక తనిఖీ గ్రామసభను మాధ్యహ్నం నుండి
పొదిలి మండల పరిషత్ కార్యలయంకు వేదిక ను మార్చటం జరిగింది అనంతరం మండల పరిషత్ కార్యలయం లో తిరిగి గ్రామసభ ప్రారంభం కాగా కొద్ది సేపటికి వర్షం వలన విద్యుత్ సరఫరా నిలిపివేయిటంతో గ్రామసభ నిలిపివేసారు అనంతరం సభ కొనసాగింది ఈ కార్యక్రమం లో డ్వామా అడిషినల్ పిడి భవని సామాజిక తనిఖీ రాష్ట్ర కమిటీ సభ్యులు వి సత్య భూపల్ రెడ్డి పోంగ్రమ్ మేనేజర్ పి వెంకటరెడ్డి యస్ఆర్పి కె వెంకయ్య ఎంపిపి కె నరసింహరావు కంభాలపాడు మాదాలవారిపాలెం ఓబులక్కపల్లి తమ్ముగుంట సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు