ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసిన అధికారులు
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకుని పొదిలి పోలీసు స్టేషన్ కు తరలించారు.
వివరాల్లోకి వెళితే జిల్లాలో అక్రమ రవాణా అరికట్టేందుకు ఒంగోలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ ఆదేశాల మేరకు పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి వెంకట్రావు అక్రమ రవాణా నివారణ చర్యలలో భాగంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించి పొదిలి పోలీసు స్టేషన్ కు తరలించగా పొదిలి ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేశారు.