రంజాన్ కిట్లున పంపిణీ చేసిన సానికొమ్ము
రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ కిట్లు ను స్ధానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక మసీదు తోట నందు మాజీ పంచాయతీ సభ్యులు ముల్లా మీరాబీ కుమారుడు జిందాభాషా ఆధ్వర్యంలో 100 మందికి రంజాన్ కిట్లు ను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి శ్రీనివాసులు,కల్లం వెంకట సుబ్బారెడ్డి,గొలమారి చెన్నారెడ్డి, బంది సాహెబ్, ముల్లా షరీఫ్ , రామలేటి జిలానీ, రోటీ యస్ధాన్ తదితరులు పాల్గొన్నారు