జనంలోకి శ్రీనన్న… కార్యకర్తల్లో ఉత్సాహం రాబోయే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు

కొత్త సంవత్సరం నుండి పూర్తిగా కార్యకర్తలకు అందుబాటులో శ్రీనన్న

మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉంటూ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడడంతో ఇంక పూర్తి స్థాయిలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డితో కలిసి పాల్గొనడంతో ఒక్కసారిగా కార్యకర్తల్లో నూతన ఉత్తేజం ఏర్పడి శ్రీనన్నను అనుసరించి కార్యకర్తలు పలు కార్యక్రమాలు పాల్గొన్నారు.

అనంతరం తన నివాసంలో పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు మరియు నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

వచ్చే ఏడాది నుండి పూర్తిగా కార్యకర్తలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం…. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించడంతో ఏ క్షణమైనా ఎన్నికల నగారా మోగే అవకాశం ఉండడంతో తమ కుటుంబం అనుచరులకు మరియు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ స్థానిక ఎన్నికల్లో పోటీకై సిద్ధంగా ఉండే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగడం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం