19వ వార్డులో ముమ్మరంగా శానిటేషన్ పనులు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మున్సిపల్ పరిధిలోని 19వ‌ వార్డు నందు ముమ్మరంగా శానిటేషన్ పనులు నిర్వహించారు.

విష జ్వరాల దృష్ట్యా  మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా స్థానిక పొదిలి మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు పి యన్ ఆర్ కాలనీ, బెస్తాపాలెం,పొదిలమ్మ నగర్ నందు పారిశుద్ధ్య పనులు దోమల మందు ను పిచికారి చేసారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు , ఎయన్ఎం నాగమ్మ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు