రెండో రోజుకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
వంట వార్పు నిర్వహించిన కార్మికులు
సమ్మెకు మద్దతు ప్రకటించిన తెలుగు దేశం పార్టీ
పొదిలి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమకు రావాల్సిన ఆరు నెలల జీతాలను చెల్లించాలని కోరుతూ చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది.
పారిశుద్ధ్య కార్మికులు ఏర్పాటుచేసిన శిబిరం లో రెండవ రోజు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నగర పంచాయతీ కార్మికులకు చెల్లించవలసిన జీతాలు , పియఫ్, ఇతర సమస్యలు పరిష్కారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
అనంతరం వంటా-వార్పు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి నారాయణ ప్రతాప్, షేక్ రసూల్, మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్, కాటూరి శ్రీను, జ్యోతి మల్లి, నరసింహారావు,వెలుగొలు వెంకటేశ్వర్లు, షేక్ యాసిన్, షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు