పొదిలికి సంచార సంజీవని ఏసి బస్సు కేటాయింపు…. వేగవంతం కానున్న కోవిడ్ పరీక్షలు
జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ఒకేసారి 10మందికి పరీక్షలు నిర్వహించేలా అధికారులు సంచార సంజీవని ఏసి బస్సును రూపొందించారు.
వివరాల్లోకి వెళితే జిల్లాలో పెరిగిపోతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల దృష్ట్యా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాల మేరకు కోవిడ్ టెస్టింగును వేగవంతం చేసే విధంగా ఏపిఎస్ ఆర్టీసీ అధికారులు బస్సును రూపొందించారు.
ఒకేసారి 10మందికి టెస్టింగ్ నిర్వహించే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ సంచార సంజీవని బస్సు నందు కోవిడ్ పరీక్షలు నిర్వహించే వైద్యులు వాహనాలలో తిరుగుతూ నిర్ణిత ప్రదేశాలనందు కోవిడ్ టెస్టింగ్ చేస్తారని అధికారుల నుండి మనకి సమాచారం. ఈ విధంగా మొత్తం 5వాహనాలను రూపొందించగా ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్కాపురం, పొదిలి పట్టణాలకు ఈ వాహనాలను కేటాయించారు.
మొత్తంగా ఈ విధంగా రూపొందించిన బస్సుల ద్వారా టెస్టింగ్ వేగవంతం అవడమే కాకుండా వేగంగా పరీక్షల ఫలితాలను పొందేందుకు వీలుంటుందని అధికారులు చెప్తున్న మాట.