పాముకాటుకు గురైన వ్యక్తి కి వైద్యచికిత్స మెరుగైన చికిత్స కొరకు ఒంగోలు తరలింపు
పాముకాటుకు గురైన వ్వక్తికి పొదిలి లో ప్రభుత్వ వైద్యశాల వైద్యబృందం వారిసేవలు అందించడం జరిగింది. వివరాలలోకి వెళ్తే జరుగుమల్లి మండలం గొంగటిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సొజ్జల మాలకొండయ్య అదేగ్రామంలో తన పొలానికి వెళ్ళి పొలం పరిశీలించి తిరిగి ఇంటికి బయలుదేరుతుండగా పొలంగట్టు దగ్గర నుండి ఒక్కసారిగా పామువచ్చి కాటేసిందని ఈ సంఘటన చూస్తుండగానే జరిగిందని మాలకొండయ్య తెలిపారు. పాము కాటువేసిందని వెంటనే పొదిలి లో వున్న కుమారుడు కృష్ణారెడ్డి కి తెలపడంతో వెంటనే వాహనాన్ని పంపించడంతో క్షతగాత్రున్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాల కు తీసుకురావడంతో వైద్యశాలలోని వైద్యాదికారి షాహిద వైద్యశాల సిబ్బంది తో కలసి వైద్యసేవలు నిర్వహించారు. మెరుగైన వైద్యసేవలు కొరకు 108 ద్వారా ఒంగోలు తరలించారు.