రేపు ఎంపి ఆదర్శ్ గ్రామ యోజన గ్రామ ఎంపిక సమావేశం

పార్లమెంటు సభ్యుల ఆదర్శ్ గ్రామ యోజన గ్రామ ఎంపిక సమావేశం గురువారంనాడు జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

వివరాల్లోకి వెళితే భారత ప్రభుత్వం ప్రతి పార్లమెంటు సభ్యుడు కొన్ని ఆదర్శ్ గ్రామాలను ఎంపిక చేసుకుని పార్లమెంటు ఆదర్శ్ గ్రామ యోజన పథకం క్రింద మహాత్మా గాంధీ కన్న కలలను సాకారంలో జాతీయ శక్తి దేశభక్తి, మౌలిక సదుపాయాలు కల్పనా, వివిధ అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం దిశగా అభివృద్ధి పనులు చేయాలని లక్ష్యంతో తలపెట్టిన పథకం క్రింద పొదిలి మండలంలోని ఆముదాలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలని తలంపుతో శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అధ్యక్షతన గురువారంనాడు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని కాబట్టి మండలంలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ కోరారు.