సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి సై అంటున్న మూరబోయిన బాబురావు
తెలుగు దేశం పార్టీ తరుపున సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవడానికి ప్రముఖ వ్యాపారవేత్త మూరబోయిన బాబురావు సై అంటున్నారని సమాచారం.
వివరాల్లోకి వెళితే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో పొదిలి గ్రామ మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేయడానికి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి…… ప్రముఖ వ్యాపారవేత్త అయిన మూరబోయిన బాబురావు యాదవ్ పోటీలో ఉండనున్నట్లు…… ఆ దిశగా పట్టణంలోని పలువురు కీలక నాయకులతో చర్చలు జరిపి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
పొదిలి గ్రామ మేజర్ పంచాయతీ ఓపెన్ జనరల్ లేక బిసి జనరల్ అయ్యే అవకాశం ఉందని తెలియడంతో ఆశావహులు ఒక్కొక్కరు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో భాగంగా పొదిలిలోని పలువురు తెలుగు దేశం పార్టీ నాయకులు బాబురావు పేరును సర్పంచ్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం…… అలాగే నిరాడంబరంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన బాబురావు పట్టణంలో అత్యంత సుపరిచితుడు…… అలాగే పట్టణంలో అన్ని వర్గాలకు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో పట్టణ తెదేపా నాయకులు కూడా ఆయన పేరును తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.