జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మండలం ఆముదాలపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ చిరుమళ్ళ శ్రీనివాస్ యాదవ్ లాంచనంగా ప్రారంభించారు.

ఆముదాలపల్లి గ్రామ సచివాలయం పరిధిలోని ప్రజలు భారీగా తరలివచ్చి వైద్యసేవలను పొందారు.

వైద్య శిబిరం నందు ప్రజలందరికీ రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి అనంతరం వైద్య సేవలు అందిస్తున్నామని మొత్తం 194 రకాలు మందులు అందుబాటులో ఉన్నాయని శిబిరంలో 44 పరీక్షలు చేస్తున్నామని అదే విధంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు, మందులు, శుక్లాములను ఉచితంగా శాస్త్ర చికిత్సలు అందిస్తున్నట్లు సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు

ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వైద్యులు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు