ఎఐఎడిఎంకె నాయకురాలు శశికళకు చెందిన 1600 కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలు లేనందున స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం నాడు తెలిపారు.
నోట్ల రద్దు సమయంలో 1500కోట్లకు సంబంధించిన లెక్కలు చూపలేదని….. అదేవిధంగా మరో వంద కోట్ల ఆస్తులకు కూడా లెక్క సరిగా చూపకపోవడంతో మొత్తం 1600కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రకటించారు.