గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయులు సతీష్ మృతి
గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయులు సతీష్ మృతి
పొదిలి : కనిగిరి మండలం బడుగులేరు ప్రాధమిక ఉన్నాత పాఠశాల నందు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మూరబోయిన సతీష్ యాదవ్ ఆకస్మిక గుండెపోటుతో మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే పొదిలిలోని స్థానిక పిఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న సతీష్ శనివారంనాడు సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు బయలుదేరి వెళ్లారు.
అయితే వినుకొండలోని ఆయన అత్తమామలను చూసి వెళ్లాలని వినుకొండ చేరుకుని అక్కడ భోజనం చేసిన అనంతరం ఆకస్మికంగా గుండెపోటు రావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
శనివారం సాయంత్రానికి ఆయన భౌతికకాయాన్ని వినుకొండ నుండి పొదిలి తీసుకుని వస్తున్నామని బంధువులు తెలిపారు…. కాగా ఆయనకు భార్య ఇద్దరు మగపిల్లలు ఉన్నారు…… సతీష్ మృతిచెందారనే వార్తతో పిఎన్ఆర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.