సతీష్ భౌతిక దేహానికి నివాళ్ళుర్పించిన నూకసాని, సానికొమ్ము ,ఉడుముల
పొదిలి పియన్ఆర్ కాలనీకి చెందిన మూరబోయిన సతీష్ యాదవ్ భౌతిక దేహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ మరియు మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి ఉడుముల శ్రీనువాసులరెడ్డిలు నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలిపారు.
సతీష్ శనివారంనాడు వినుకొండలో గుండెపోటుతో స్వర్గస్తులైన సంగతి తెలిసిందే…… ఆయన భౌతికకాయాన్నిశనివారం రాత్రికి పియన్ఆర్ కాలనీలోని స్వగృహానికి తరలించారు. ఆదివారం ఉదయం భౌతికకాయాన్ని ఆహార భద్రత కమిషన్ డైరెక్టర్ స్వర్ణ గీత, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బంకా చిరంజీవి, అఖిల భారత యాదవ మహాసభ నాయకులు అన్నేబోయిన కృష్ణయ్య, పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు, బత్తుల వెంకటేష్ యాదవ్,జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా, తెదేపా నాయకులు పియల్పీ యాదవ్, ఉద్యోగ సంఘం నాయకులు చల్లా లక్ష్మీ నారాయణ, పెమ్మని బాల వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయలు, తదితరులు పాల్గొని నివాళులర్పించి సంతాపం ప్రకటించారు.