జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సురేష్
జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఇన్స్పైర్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆయన మాట్లాడుతూ అక్షరాస్యతలో పేదరిక నిర్ములనే ద్యేయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని పేదరికం చదువుకు అడ్డంకిగా మారకూడదు, పిల్లలు బాలకార్మికులుగా కాకుండా పిల్లలందరూ చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని …..
జగనన్న అమ్మఒడి ద్వారా 15000రూపాయలు అందించడం, జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనం అందించడం, నాడు నేడు కార్యక్రమం ద్వారా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అభివృద్ధి చేయడం, వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా విద్యార్థులకు దృష్టి లోపాలను సరిచేయడం, ఆంగ్లభాషలో బోధన చేయడం విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లేలా చేయడం వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని….. విద్యార్థులు చేయాల్సిన పని చక్కగా విద్యను అభ్యసించడం ఒక్కటే అందుకే చిన్నారుల విద్యాభాద్యత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని పిల్లలు బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన పలు సైన్స్ ఆవిష్కరణలను తిలకించి విద్యార్థులను వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, జిల్లాస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.