మూడు నెలల పెండింగ్ జీతాల బకాయిలు ఇప్పించాలని గగ్గోలు పెడుతున్న సచివాలయ ఉద్యోగులు
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని సచివాలయల్లో పనిచేసే ఉద్యోగులకు సాంకేతిక కారణాల వలన ఏర్పడిన జీతాల బకాయిలు వారి పాలిట శాపంగా మారింది.
గత సంవత్సరం అక్టోబర్, నవంబర్,డిసెంబర్ నెలలకు గాను మూడు నెలల జీతాలు ఆగిపోవడంతో వేరే ప్రాంతాలనుంచి వచ్చి ఇక్కడ అద్దె ఇళ్లల్లో వుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం చాలా కష్టంగా ఉందని, పిల్లల స్కూల్ ఫీజు లు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని పొదిలి మున్సిపల్ కమిషనర్ జోసెఫ్ డేనియల్ ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
గతంలో కూడా ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చిన సమస్య పరిష్కారం కాలేదని ఇప్పుడైనా మా యందు దయ ఉంచి సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన తమ మూడు నెలల జీతాలను తమకిప్పించాలని వారు కమిషనర్ ను వేడుకున్నారు.
వినతి పత్రం ఇచ్చిన వారిలో సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి గడ సుబ్బారావు, అర్బన్ సెక్రెటరీ కె విజయ,జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సుబ్బారావు,సాయి తరుణ్,సాయి కృష్ణ,నాగమ్మ,మాధవి తదితరులు పాల్గొన్నారు