కోవిడ్ పట్ల సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్
కోవిడ్ వైరస్ పట్ల గ్రామ సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు అన్నారు. వివరాలోకి. వెళితే స్థానిక ఐదో గ్రామ సచివాలయంలో నందు పంచాయతీ అదనపు కార్యదర్శి పద్మ ఆద్యక్షతనతో జరిగిన గ్రామ సభలో ముఖ్య అతిధిగా హాజరైన తహశీల్దార్ ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు కలిసి కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధించడానికి కృషి చేయాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఎల్లప్పుడూ అధికారులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ , ఈఓఆర్డీ రాజశేఖర్, పంచాయతీ ప్రత్యేక అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మరియు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు