అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దు….. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు : యస్ఐ శ్రీరాం
పొదిలి : అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, వంటివి నిర్వహించవద్దని పొదిలి యస్ఐ శ్రీరాం తెలిపారు.
దర్శి సబ్ డివిజన్ లోని దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, కురిచేడు, పొదిలి, తాడివారిపల్లి, మర్రిపూడి, కొనకనమిట్ల, దొనకొండ, అద్దంకి, మేదరమెట్ల, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో 30పోలీసు యాక్టు అమలులో ఉందని శాంతిభద్రతల దృష్ట్యా తప్పని సరిగా బహిరంగ సభలు, సమావేశాలు, పెద్ద ఎత్తున జనాలను పోగుచేయడం, ర్యాలీలు వంటివి నిర్వహించేవారు దర్శి సబ్ డివిజన్ పోలీసు అధికారి అనుమతి పొందాలని…… అనుమతి పొందకుండా అటువంటి కార్యక్రమాలు నిర్వహించేవారికి కఠిన చర్యలు తప్పవని పొదిలి యస్ఐ శ్రీరాం హెచ్చరించారు.