అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టివేత

కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.

రాబడిన సమాచారం తనిఖీలు నిర్వహించగా 510 బస్తాల బియ్యం, లారిని పట్టుకొని సిజ్ చేసి పొదిలి పౌరసరఫరాల గిడ్డంగి నందు అప్పజెప్పినట్లు గిడ్డంగి అధికారి షఫీ తెలియజేసారు.

బియ్యం స్వాధీనం చేసుకొని లారీని కొనకొనమీట్ల పొలీసులకు అప్పజెప్పినట్టు తెలిపారు. అక్రమదారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాట్లు తెలియజేసారు.