అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ స్టేషన్ అధికారులు పట్టివేత సంఘటన శనివారం నాటి చోటు చేసుకుంది
వివరాల్లోకి వెళితే మార్కాపురం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో స్టేషన్ ఎఈయస్ డి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పొదిలి పట్టణంలో తనిఖీలు చేపట్టాగా కామేపల్లి నుంచి రాచర్ల మండలం సొమదేవునిపల్లి కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా టిప్పర్ పట్టివేసి 10850 రూపాయలు అపరాధ రుసుం వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీల్లో పొదిలి యస్ఇబి స్టేషన్ యస్ఐ శ్రీధర్ బాబు హెడ్ కానిస్టేబుల్ కె వెంకట్రావు కానిస్టేబులు షేక్ బాజీ సయ్యద్ పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు