సియం కప్ కు మండల స్థాయి క్రీడా జట్లు ఎంపిక

ముఖ్యమంత్రి కప్ కు నియోజకవర్గ స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పొదిలి మండల జట్లను ఎంపిక చేశారు.

బుధవారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మండల పరిధిలోని వివిధ పాఠశాలల నుంచి చెందిన విద్యార్థులకు పోటీలు నిర్వహించి మండల జట్టులను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, మండల విద్యా అధికారి రాఘరామయ్య , వివిధ పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు, పిడి‌లు మరియు పిఈటిలు తదితరులు పాల్గొన్నారు