ఇంటి పన్నులు వసూలు కంప్యూటరీకరణ గురించి అవగాహన సదస్సు

పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు శనివారం నాడు ఇంటి పన్నులు వసూలు విధింపు మరియు కంప్యూటరీకరణ యాప్ గురించి పంచాయతీ కార్యదర్శుల ప్రత్యేకం అవగాహన సదస్సును నిర్వహించారు.

దర్శి, దొనకొండ, కురిచేడు,ముండ్లమూరు, తాళ్లూరు,కొనకనమీట్ల,పొదిలి,మర్రిపూడి,కనిగిరి, హనుమంతనిపాడు, చంద్రశేఖరపురం,వెలిగండ్ల ,పామురు,
పిసిపల్లి, తర్లబాడు 15 మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని డివిజన్ పంచాయతీ అధికారి భాస్కర్ రెడ్డి,కొనకనమీట్ల ఈఓఆర్డీ జనార్ధన్,జి సుందర్ రెడ్డి, కందుకూరు డివిజన్ పంచాయతీ ఆఫీస్ పరిపాలన అధికారి పర్యవేక్షణలో నిర్వహించారు.