దివ్యంగ విద్యార్థి లకు స్కూల్ కిట్టులను పంపిణీ

పొదిలి మండల్ పరిషద్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న హనుమంతరావు కుమారుడు వంశీకృష్ణ జన్మదినం సందర్బంగా మానసిక దివ్యంగ పిల్లలకు స్వెట్టర్,పలక,బాగ్,పుస్తకం, పెన్,పెన్సిల్, తదితర వస్తువులు జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు & ఎంపీపీ నర్సింహారావు చేతుల మీదుగా మండల్ పరిషద్ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది.కార్యక్రమంలో మండల అబివృద్ది అధికారిని  ఝాన్సీరాణి, ఎంపీటీసీ ఇమాంస, హౌసింగ్ డిఇ లక్మి నారయణ  మండల్ పరిషద్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.