రాజీనామా చేసిన వారిని సస్పెండ్ చేయడం హస్యాస్పదం
పొదిలి బార్ అసోసియేషన్ నెంబర్ 182/ 2014కు తాము రాజీనామా చేసి నూతనంగా బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నామని బార్ అసోసియేషన్ ( షబ్బీర్) గ్రూపుకు చెందిన షేక్ షబ్బీర్, యస్ఎం బాషా, బోడగిరి వెంకటేశ్వర్లు, జి శ్రీనివాసులు, జి పెద్దయ్యలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ ఐదుగురము బార్ అసోసియేషన్ నాయకత్వం వైఫల్యం చెందడంతో తమ రాజీనామా చేసి నూతనంగా బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కార్యవర్గం ఎంపిక చేసుకున్నామని మా బార్ అసోసియేషన్ తో మొత్తం ముడు బార్ అసోసియేషన్లు ఉన్నాయని మేము న్యాయవాదుల సమస్యలు పరిష్కారం కొరకు పని చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఒక ప్రకటనలో తెలిపారు.