పంచాయతీ కార్యదర్శిల సంఘం అధ్యక్షులుగా శంకర్ యాదవ్ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ పంచాయతీ కార్యదర్శిల సంఘం మర్రిపూడి మండలం అధ్యక్షులుగా పెట్టెల శంకర్ యాదవ్ ఎన్నికయ్యారు.

వివరాల్లోకి వెళితే సోమవారంనాడు స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో కె యన్ యస్ రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

గౌరవ అధ్యక్షులుగాకె యన్ యస్ రాంబాబు…. అధ్యక్షులుగా పెట్టెల శంకర్ యాదవ్……. ఉపాధ్యక్షులుగా బి వి నాయుడు,వి బాలకృష్ణ, జి రజినీ…….. కార్యదర్శిగా ఎ చెన్నయ్య సంయుక్త కార్యదర్శిలుగా బి శ్రీహరి, పి సుబ్బులు, బి సుబ్బాయమ్మ , కోశాధికారిగా షేక్ ఆరీఫ్ సహాయ కోశాధికారిగా డి హరికృష్ణ మరియు 11మంది కార్యవర్గ సభ్యులతో కూడిన కార్యవర్గం ఎన్నికైనట్లు నూతన కమిటీ అధ్యక్షులు శంకర్ యాదవ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.