ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న శివ నాగరాజు
జిల్లా నందు ఉత్తమ సచివాలయం సర్వేయర్ గా ఎంపికైన పొదిలి నగర పంచాయితీ మాదాల వారి పాలెం సచివాలయం సర్వేయర్ శివ నాగరాజు కు
సేవా పురస్కారాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు.
వివరాల్లోకి వెళితే ఒంగోలు లో జరిగిన ప్రకాశం జిల్లా స్థాయి 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో వివిధ శాఖల ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు సేవా పురస్కారాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, యస్పీ మలిక గార్జ్ మరియు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు