శైవక్షేత్రలకు ప్రత్యేక బస్సులను నడపండి : జంకె

మహాశివరాత్రి పండుగ సందర్భంగా పొదిలి ఆర్టీసీ డిపో నుండి శైవక్షేత్రలకు ప్రత్యేక బస్సులు నడపాలని మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్ తో అన్నారు సోమవారం సాయంత్రం పొదిలి ఆర్టీసీ బస్టాండ్ పరిశీరాలను పర్యవేక్షణ చేసి డిపో మేనేజర్ తో శైవక్షేత్రలకు ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఒంగోలు మరియు పొదిలి నుండి శ్రీశైలం మరియు రామతీర్థం కు 27 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ శివ ప్రసాద్ తెలిపారు ఒంగోలు నుండి శ్రీశైలంకు ప్రత్యేక బస్సులో 270 పిల్లలకు 130 రూపాయలు బస్ చార్జీ అవుతోందని చెప్పారు పొదిలి నుండి శ్రీశైలంకు పెద్దలకు 220 పిల్లలకు 110 రూపాయలు నిర్ణయించామని శాసన సభ్యులు కు వివరించారు డిపో లోని మరుగుదోడ్లలను పరిశీలించి మేరుగైన వసతులు కల్పించాలని మంచి నీటిని సదుపాయం కల్పించాలని డిపో మేనేజర్ కు ఆదేశాలు జారీ చేసారుఈ కార్యక్రమంలో పొదిలి జడ్పీటిసి సాయ ఎంపిపి నరసింహరావు వైసీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి బ్రహ్మ రెడ్డి ముల్లా ఖాదర్ భాష కందుల రాజశేఖర్ వెలుగోలు కాశీ ఆర్టీసీ డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు