పొదిలిటైమ్స్….. ఉత్తమ సంఘ సేవకుడు అవార్డు గ్రహీత శివరాజు

ఉత్తమ సంఘ సేవకుడు అవార్డు గ్రహీతగా శివరాజును ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి పట్టణంలో నిర్మలా కాన్వెంట్ నందు నూతన భవన నిర్మాణం కోసం శివరాజు 16 లక్షల రూపాయల నిధులు అందజేశారు. అదేవిధంగా పట్టణంలో పలు కార్యక్రమాలకు తన పేరును ప్రచారం చేసుకోకుండా తన ఆర్థిక సహకరం అందిస్తూ సంఘ సేవలో భాగమైన శివరాజును గుర్తించి పొదిలిటైమ్స్ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ సంఘ సేవకుడిగా అవార్డును ప్రధానం చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.