పోలీసు లాంఛనాలతో శివ అంత్యక్రియలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మర్రిపూడి పోలీసు స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీసు శివరామకృష్ణ గౌడ్ అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో నిర్వహించారు.
సోమవారం నాడు గుండె పోటు తో మరణించిన శివరామకృష్ణ గౌడ్ అంత్యక్రియలను మంగళవారం నాడు స్థానిక పొదిలి హిందూ స్మశానం నందు అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో నిర్వహించారు.
స్థానిక పొదిలి పోలీసు క్వార్టర్స్ లోని తన నివాసం గృహం నుంచి హిందూ స్మశానవాటిక వరకు బంధుమిత్రులు, పోలీసుల మద్య అంతిమ యాత్ర నిర్వహించి హిందు సంప్రదాయం పద్దతి ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేసారు.
ఈ కార్యక్రమంలో దరిశి డియస్పీ నారాయణ స్వామి రెడ్డి, పొదిలి సిఐ సుధాకర్ రావు, పొదిలి మర్రిపూడి యస్ఐలు శ్రీహరి అంకామ్మరావు మరియు బంధుమిత్రులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు