నియమక పత్రలు పంపిణీ చేసిన యస్ఐ నాగరాజు

ప్రధాన మంత్రి కుశాల్ వికాస్ యోజన నియమక మరియు ఉత్తీర్ణత పత్రలను పొదిలి యస్ఐ నాగరాజు పంపిణీ చేసారు స్ధానిక రధం రోడ్డు ప్రవీణ్ బిజినెస్ డెవలప్మెంట్ అడ్వయిజర్స్ వారు ఏర్పాటు చేసిన ఆజీవిక మరియు కౌసల్ మేళా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఇటువంటి శీక్షణలు వలన ఆర్థికంగా ఎదగటమే కాకుండా సమాజంలో దైర్యవంతులు అవతారని ఏ సమయంలో అయినా పోలీసుల సహాయ అవసరం అనుకుంటే మాకు ఫోన్ చేస్తే తక్షణమే సహాయం చేస్తామని యస్ఐ నాగరాజు అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి ఈఓఆర్డి రంగానాయకులు ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు గునుపూడి భాస్కర్ నిర్వకులు ప్రవీణ్ కుమార్ శ్రీనువాసురెడ్డి ప్రసాద్ మరియు శీక్షణ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు