పొదిలి ఎస్ఐ వెంకట సైదులును సన్మానించిన కరిముల్లా బేగ్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి ఎస్సై వెంకట సైదులను బుధవారం హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మొగల్ కరీముల్లా బేగ్ పోలీస్ స్టేషన్లో కలిశారు.

ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని అభినందించారు… సమాజంలోని నిరుపేదలకు పలు విధాలుగా సేవలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు . కరీముల్లా బేగ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు నా వంతు సహకారం ఉంటుందని చెప్పారు.

అనంతరం ఎస్సై వెంకట సైదులను ఘనంగా సన్మానించి మిఠాయిలు అందజేశారు.. సన్మానించిన వారిలో పొదిలి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షబ్బీర్ ఉన్నారు.