బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ సురేష్
పొదిలి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐ గా కె సురేష్ బాధ్యతలు స్వీకరించారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు పొదిలి ఎస్ఐ శ్రీరామ్ ను కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసి….. ఆయన స్థానంలో రాచర్ల పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న కె సురేష్ ను పొదిలి ఎస్ఐ గా బదిలీ చేయడంతో ఎస్ఐ సురేష్ శనివారం ఉదయం పొదిలి ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించారు.
తొలుత పొదిలి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఎస్ఐ సురేష్ కు ఎస్ఐ శ్రీరామ్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాధ్యతలను సురేష్ కు అప్పగించారు. బదిలీపై వెళ్తున్న ఎస్ఐ శ్రీరామ్ కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు.