నాటుసారా బట్టీపై ఎస్ఐ సురేష్ మెరుపు దాడి… 2200లీటర్ల బెల్లంఊట ధ్వంసం
నాటుసారా బట్టీపై పొదిలి ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 2200లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేశారు.
వివరాల్లోకి వెళితే మండలంలోని గోగినేని వారి పాలెం సమీపంలోని మూసివాగు వద్ద నాటుసారా బట్టీను ఏర్పాటు చేశారనే విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో కలిసి బట్టీలపై మెరుపు దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 2200లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పొదిలి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.