వర్షంలోనూ లాక్ డౌన్ ను పర్యవేక్షించిన ఎస్ఐ సురేష్

కొనకనమిట్ల మండల పరిధిలోని వెలిగండ్ల గ్రామంలో కరోనా లక్షణాలున్న వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ కావడం…. వెలిగండ్ల గ్రామం పొదిలి-కొనకనమిట్ల మండలాల సరిహద్దు గ్రామం కావడంతో గత మూడు రోజులుగా పొదిలి మండలంలోని పలు గ్రామాలను రెడ్ జోన్ గా ప్రకటించి ఆయా గ్రామాల ప్రజలు బయటికి రాకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే మండలంలోకి కొత్త వ్యక్తులు ఎవరు రాకుండా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద జరుగుతున్న తనిఖీలు అలాగే ప్రజలు బయటికి రాకుండా గురువారంనాడు కురిసిన వర్షంలో సైతం విధులు నిర్వహిస్తూ 144సెక్షన్ ను పొదిలి ఎస్ఐ సురేష్ పటిష్టంగా అమలుపరచారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అలాగే ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్న టీచర్లు చేస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు.