మహిళా మేట్ల శిక్షణ తరగతులు
పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు జాతీయ ఉపాధి హామీ పథకం లో పని చేసే మహిళా మేట్ల శిక్షణ తరగతులు ఎపిఓ బుల్లెనరావు అధ్యక్షతనతో శుక్రవారం నాడు జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన 2022 సంవత్సరం పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని అదే విధంగా పనులు ప్రారంభం జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వివిధ దస్త్రాలు ఏ విధంగా తయారు చెయ్యాలి వాటి తీసుకోవాల్సిన మెలుకువలు తదితర అంశాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో మహిళా మేట్ల మరియు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు