శివ నామస్మరణతో మారుమోగిన శివాలయం

పొదిలి లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది కార్తీక సోమవారం సందర్భంగా శివ నామస్మరణతో శివాలయం మారుమోగింది. కార్తీకమాసం సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజుగా హిందువులు భావిస్తారు, వేకువజామునే లేచి స్నానమాచరించి శివాలయానికి వెళ్లి పరమశివుని దర్శించుకుంటారు. పైగా ఈరోజు నాగుల చవితి కూడా కావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

పొదిలి లో స్వయంభూ గా పిలవబడు తున్న శ్రీనిర్మమహేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ నిర్వాహకులు సిబ్బంది భక్తులకు ఇబ్బంది కలుగకుండా క్యూలైన్ లను ఏర్పాటు చేసి అందరికీ దర్శనం అయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు .ఈ కార్తీక మాసంలో అధ్యాత్మిక శోభ సంతరించుకుంది సుమారు గా 10వేల మంది పైగా భక్తులు హాజరయ్యారు.