విద్యార్థులకు యూనిఫాం పంపిణీ

పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామంలోని ఎంపీయూపీ స్కూల్ నందు స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ బలగాని నాగరాజు విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో అన్ని ఉచితంగా లభిస్తున్నాయని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ఏమి తీసిపోవట్లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా దాదాపుగా ఇంగ్లీషు మీడియం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కార్పొరేట్ పాఠశాలలలో చదువు మాత్రమే వస్తుందని కానీ ఉన్నత విలువలతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలలలో మాత్రమే విద్యార్థులు అలవరచుకుంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గోవిందరెడ్డి, ఉపాధ్యాయులు నాగార్జునరావు, మాధవరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.