బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో జడ్జి రాఘవేంద్రకు ఘన వీడ్కోలు
editor2
0 Comments
Solid farewell to Judge Raghavendra under the auspices of Bar Association lawyers, బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో జడ్జి రాఘవేంద్రకు ఘన వీడ్కోలు
పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి రాఘవేంద్రకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.
వివరాల్లోకి వెళితే పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జిగా రెండున్నర సంవత్సరాల కాలం పాటు జడ్జిగా విధులు నిర్వహించిన రాఘవేంద్ర బదిలీపై శ్రీకాళహస్తి వెళుతున్న సందర్భంగా బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆయనను సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు.
బార్ అసోసియేషన్ న్యాయవాదులు యంవి రమణ కిశోర్, ఎస్ఎం బాషా, ధర్నాసి రామారావు, సురేష్ కుమార్, వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, సుజాత, ఖాదర్ వలి, నాయబ్ రసూల్, శైలజ, జ్ఞాన కుమారి, హరిప్రసాద్, రబ్బానీ, బాలబ్రహ్మం, రాఘవ తదితరులు పాల్గొన్నారు.