తహశీల్దారుకు ఘన వీడ్కోలు

పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు జె ప్రభాకరరావుకు పట్టణంలోని ప్రముఖులు, ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు.

వివరాల్లోకి వెళితే పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు గా 13నెలల 13రోజులపాటు పని చేసిన అనంతరం అద్దంకి బదిలీ చేయగా సోమవారంనాడు పొదిలి తహశీల్దారుగా రిలీవ్ అయి అద్దంకి తహశీల్దారుగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తున్న తహశీల్దార్ ప్రభాకరరావును స్థానిక మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మీడియా ప్రతినిధులు తదితరులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మ నాయుడు, మారుతిరావు, వైకాపా నాయకులు జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి,కొత్తపులి బ్రహ్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.